Pawan Kalyan’s OG  to be launched on January 30: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది, ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాకి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దానికి షార్ట్ ఫామ్ ఓజి అని పిలుస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా జనవరి 30వ తేదీ అంటే సోమవారం నాడు అధికారికంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అసలు ఇలాంటి కాంబినేషన్లో సినిమా రావడమే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని షాకింగ్ న్యూస్ లు బయటకు వస్తున్నాయి. అదేమిటంటే ఈ సినిమాల్లో హీరోయిన్ ఉండదు. పాటలు ఉండవు, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గురు లాంటి ఒక రోల్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది.


వాస్తవానికి రన్ రాజా రన్ సినిమాతో మంచి క్రేజ్ తెచుకున్న సుజిత్ ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో సాహో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. రెండో సినిమానే ప్రభాస్ లాంటి పాన్  ఇండియా స్టార్ దొరకడంతో అతని కెరీర్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆయన కెరీర్ వెనక్కి లాగేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా సెట్ చేసుకోవడంతో ఆయన కెరీర్ మళ్ళీ కుదుటపడుతుందని అందరూ భావిస్తున్నారు.


అయితే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి ఎలాంటి పాటలో లేవనడం, ఎలాంటి హీరోయిన్ కూడా లేదు అని చెప్పడంతో ఇదేదో కొత్తగా ఉన్నట్లుందే అని పవన్ అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రస్థానానికి ఉపయోగపడేలా సినిమాలు ఉంటే బాగుంటాయని అభిమానులు భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.
Also Read: Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య సక్సెస్ ఈవెంట్లో తొక్కిసలాట.. తీవ్ర గాయాలు?


Also Read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారకరత్న పరిస్థితి.. బాబు ఏమన్నారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook